ఏడు మారులు
కీర్తనల గ్రంథము 119:62

న్యాయమైన నీ విధులనుబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రివేళ నేను మేల్కొనువాడను.

కీర్తనల గ్రంథము 55:17

సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును

బట్టి
కీర్తనల గ్రంథము 48:11

నీ న్యాయవిధులనుబట్టి సీయోను పర్వతము సంతోషించును గాక యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక.

కీర్తనల గ్రంథము 97:8

యెహోవా , సీయోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయవిధులనుబట్టి సంతోషించుచున్నారు యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు .

ప్రకటన 19:2

ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవి; తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పుతీర్చి తన దాసుల రక్తమునుబట్టి దానికి ప్రతిదండన చేసెను; మరి రెండవసారి వారు -ప్రభువును స్తుతించుడి అనిరి.