మరియు యోబుయొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరమేమియు చెప్పకయే యోబుమీద దోషము మోపినందుకు వారిమీద కూడ అతడు బహుగా కోపగించెను.
నిశ్చయమైనట్టు రూఢిగాపలుకువాటినైనను గ్రహింపక పోయినను ధర్మశాస్త్రోపదేశకులై యుండగోరి విష్‌ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి.