Esther
పరమగీతములు 6:9

నా పావురము నా నిష్కళంకురాలు ఒకతే ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె కన్నతల్లికి ముద్దు బిడ్డ స్త్రీలు దాని చూచి ధన్యురాలందురు రాణులును ఉపపత్నులును దాని పొగడుదురు.

పరమగీతములు 8:10

నేను ప్రాకారమువంటిదాననైతిని నా కుచములు దుర్గములాయెను అందువలన అతనిదృష్టికి నేను క్షేమము నొందదగినదాననైతిని.

అపొస్తలుల కార్యములు 7:10

దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరోయెదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన యింటికంతటికిని అతనిని అధిపతిగా నియమించెను.