ప్రధానులు
నెహెమ్యా 7:6

జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా అజర్యా రయమ్యా నహమానీ మొర్దెకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి నెహూము బయనా అనువారితోకూడ బాబెలు రాజైన నెబుకద్నెజరుచేత చెరలోనికి కొనిపోబడి

ఎజ్రా 2:1

బబులోను రాజైన నెబుకద్నెజరుచేత బబులోను దేశమునకు చెరగా తీసికొనిపోబడినవారికి ఆ దేశమందు పుట్టి చెరలోనుండి విడిపింపబడి

ఇశ్రాయేలీయులును
నెహెమ్యా 7:73

అప్పుడు యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు జనులలో కొందరును, నెతీనీయులు ఇశ్రాయేలీయులందరును, తమ పట్టణములయందు నివాసముచేసిరి.

1దినవృత్తాంతములు 9:1-3
1

ఈ ప్రకారము ఇశ్రాయేలీయులందరును తమ వంశములచొప్పున సరిచూడబడినమీదట వారిపేళ్లు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడెను. యూదా వారు చేసిన ద్రోహమునకై వారు బాబెలునకు చెరగొనిపోబడిరి.

2

తమ స్వాస్థ్యములైన పట్టణములలో మునుపు కాపురమున్న వారెవరనగా ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును నెతీనీయులును.

3

యూదావారిలోను బెన్యామీనీయులలోను ఎఫ్రాయిము మనష్షే సంబంధులలోను యెరూషలేమునందు కాపురమున్న వారెవరనగా

ఎజ్రా 2:70

యాజకులును లేవీయులును జనులలో కొందరును గాయకులును ద్వారపాలకులును నెతీనీయులును తమ పట్టణములకు వచ్చి కాపురముచేసిరి. మరియు ఇశ్రాయేలీయులందరును తమ తమ పట్టణములందు కాపురముచేసిరి.

నెతీనీయులును
ఎజ్రా 2:43

నెతీనీయులలో జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు,

ఎజ్రా 2:55

సొలొమోను సేవకుల వంశస్థులు, సొటయి వంశస్థులు, సోపెరెతు వంశస్థులు, పెరూదా వంశస్థులు,

వంశస్థులును
నెహెమ్యా 7:57-60
57

సోపెరెతు వంశస్థులు పెరూదా వంశస్థులు

58

యహలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు

59

షెఫట్య వంశస్థులు హట్టీలు వంశస్థులు జెబాయీయుల సంబంధమైన పొకెరెతు వంశస్థులు ఆమోను వంశస్థులు.

60

ఈ నెతీనీయులందరును సొలొమోను దాసుల వంశస్థులును మూడువందల తొంబది యిద్దరు.

ఎజ్రా 2:55-58
55

సొలొమోను సేవకుల వంశస్థులు, సొటయి వంశస్థులు, సోపెరెతు వంశస్థులు, పెరూదా వంశస్థులు,

56

యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు,

57

షెఫట్య వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జెబాయీము సంబంధమైన పొకెరెతు వంశస్థులు, ఆమీ వంశస్థులు,

58

నెతీనీయులును సొలొమోను సేవకుల వంశస్థులును అందరును కలిసి మూడువందల తొంబది యిద్దరు.