సవరింపబడిన రొట్టెవిషయములోను
లేవీయకాండము 24:5

నీవు గోధుమలపిండిని తీసికొని దానితో పండ్రెండు భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు సేరు పిండి యుండవలెను.

2 దినవృత్తాంతములు 2:4
నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకును సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును, ఉదయ సాయంకాలముల యందును, విశ్రాంతి దినములయందును, అమావాస్యల యందును, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవములయందును, ఇశ్రాయేలీయులు నిత్యమును అర్పింపవలసిన దహనబలులను అర్పించుటకును, ఆయన నామఘనతకొరకు మందిరమొకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడునట్లుగా నేను కట్టించబోవుచున్నాను.
నిత్యము అర్పించు దహన బలి
సంఖ్యాకాండము 28:1-29
1

యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

2

నీవు ఇశ్రాయేలీయులకు ఈలాగు ఆజ్ఞాపించుము నాకు సువాసన కలుగుటకై మీరు హోమరూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నాయొద్దకు తెచ్చుటకు జాగ్రత్తపడవలెను.

3

మరియు నీవు వారికీలాగు ఆజ్ఞాపించుము మీరు యెహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతి దినము నిర్దోషమైన యేడాదివగు రెండు మగ గొఱ్ఱ పిల్లలను అర్పింపవలెను.

4

వాటిలో ఒక గొఱ్ఱపిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవదానిని అర్పింపవలెను.

5

దంచితీసిన మూడు పళ్లలోనిది పావు నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో పదియవవంతు నైవేద్యము చేయవలెను.

6

అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా సీనాయికొండమీద నియమింపబడిన నిత్యమైన దహనబలి.

7

ఆ మొదటి గొఱ్ఱపిల్లతో అర్పింపవలసిన పానార్పణము ముప్పావు; పరిశుద్ధస్థలములో మద్యమును యెహోవాకు పానార్పణముగా పోయింపవలెను.

8

ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించినట్లు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా ఆ రెండవ గొఱ్ఱపిల్లను సాయంకాలమందు అర్పింపవలెను.

9

విశ్రాంతిదినమున నిర్దోషమైన యేడాదివగు రెండు గొఱ్ఱపిల్లలను నైవేద్యరూపముగాను, దాని పానార్పణము గాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో రెండు పదియవవంతులను అర్పింవవలెను.

10

నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును గాక యిది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహనబలి.

11

నెలనెలకు మొదటిదినమున యెహోవాకు దహనబలి అర్పించవలెను. రెండు కోడెదూడలను ఒక పొట్టేలును నిర్దోషమైన యేడాదివగు ఏడు గొఱ్ఱపిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోను,

12

నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవవంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పొట్టేలుతోను, నూనెతో కలపబడి తూమెడు పిండిలో రెండు పదియవ వంతులను నైవేద్యముగాను, ఒక్కొక్క గొఱ్ఱపిల్లతో నూనెతో కలపబడిన తూమెడు పిండిలో నొక పదియవవంతును నైవేద్యముగాను చేయవలెను.

13

అది యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలి.

14

వాటి పానార్పణములు ఒక్కొక్క కోడెతో పడిన్నర ద్రాక్షారసమును పొట్టేలుతో పడియు గొఱ్ఱ పిల్లతో ముప్పావును ఉండవలెను. ఇది సంవత్సరములో మాస మాసమునకు జరుగవలసిన దహనబలి.

15

నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును గాక యొక మేక పిల్లను పాపపరిహారార్థబలిగా యెహోవాకు అర్పింపవలెను.

16

మొదటి నెల పదునాలుగవ దినము యెహోవాకు పస్కాపండుగ.

17

ఆ నెల పదునయిదవ దినము పండుగ జరుగును. ఏడు దినములు పొంగని భక్ష్యములనే తినవలెను.

18

మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు

19

అయితే యెహోవాకు దహనబలిగా మీరు రెండు కోడెదూడలను ఒక పొట్టేలును ఏడాదివగు ఏడు మగ గొఱ్ఱపిల్లలను అర్పింపవలెను. అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై యుండవలెను

20

వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమల పిండి.

21

ఒక్కొక్క కోడెతో తూములో మూడు పదియవవంతులను, పొట్టేలుతో రెండు పదియవ వంతులను ఆ యేడు గొఱ్ఱపిల్లలలో ఒక్కొక్క గొఱ్ఱ పిల్లతో ఒక్కొక్క పదియవవంతును

22

మీకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాపపరిహారార్థబలిగా ఒక మేకను అర్పింపవలెను.

23

ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహనబలి గాక వీటిని మీరు అర్పింపవలెను.

24

అట్లే ఆ యేడు దినములలో ప్రతిదినము యెహోవాకు ఇంపైన సువాసనగల హోమద్రవ్యమును ఆహారముగా అర్పించవలెను. నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును గాక దానిని అర్పించవలెను.

25

ఏడవ దినమున పరిశుద్ధసంఘము కూడవలెను. ఆ దినమున మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు.

26

మరియు ప్రథమ ఫలములను అర్పించుదినమున, అనగా వారముల పండుగదినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చునప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు.

27

యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా మీరు రెండు కోడె దూడలను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు మగ గొఱ్ఱ పిల్లలను వాటికి నైవేద్యముగా ప్రతి కోడెదూడతోను

28

నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవ వంతులను, ప్రతి పొట్టేలుతో రెండు పదియవవంతులను

29

ఆ యేడు గొఱ్ఱపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవవంతును

హెబ్రీయులకు 10:11

మరియు ప్రతి యాజకుడు దినదినము సేవచేయుచు, పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును.

పనియంతటి
2 దినవృత్తాంతములు 24:5-14
5
అతడు యాజకులను లేవీయులను సమకూర్చిమీరు యూదా పట్టణములకు పోయి మీ దేవుని మందిరము బాగు చేయుటకై ఇశ్రా యేలీయులందరియొద్దనుండి ధనమును ఏటేట సమకూర్చుచు, ఈ కార్యమును మీరు త్వరపెట్టవలెనని వారికాజ్ఞ ఇచ్చెను. వారు దానిని త్వరగా చేయకపోయినందున
6
రాజు ప్రధానయాజకుడగు యెహోయాదాను పిలిచిఆ దుర్మార్గురాలైన అతల్యాకుమారులు దేవుని మందిర మును పాడుచేసి, యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్ఠోపకరణముల నన్నిటిని బయలుదేవతపూజకు ఉప యోగించిరి.
7
సాక్ష్యపు గుడారమును బాగుచేయుటకైయూదాలో నుండియు యెరూషలేములోనుండియు ఇశ్రాయేలీయుల సమాజకులచేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతో నీ వెందుకు చెప్పి తెప్పించలేదని యడిగెను.
8
కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిరద్వారము బయట ఉంచిరి.
9
మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలీయులకు నిర్ణ యించిన కానుకను యెహోవాయొద్దకు జనులు తేవలెనని యూదాలోను యెరూషలేములోను వారు చాటించిరి.
10
కాగా అధిపతులందరును జనులందరును సంతోషముగా కానుకలను తీసికొని వచ్చి చాలినంతమట్టుకు పెట్టెలో వేసిరి.
11
లేవీయులు ఆ పెట్టెను రాజు విమర్శించు స్థలము నకు తెచ్చుచు వచ్చిరి; అందులో ద్రవ్యము విస్తారముగా నున్నట్టు కనబడినప్పుడెల్ల, రాజుయొక్క ప్రధాన మంత్రియు ప్రధాన యాజకుడు నియమించిన పై విచా రణకర్తయు వచ్చి, పెట్టెలోనున్న ద్రవ్యమును తీసి యథా స్థానమందు దానిని ఉంచుచు వచ్చిరి; వారీచొప్పున పలు మారు చేయుటచేత విస్తారమైన ద్రవ్యము సమకూర్చబడెను.
12
అప్పుడు రాజును యెహోయాదాయును యెహోవా మందిరపు పనిచేయువారికి దానినిచ్చి, యెహోవా మందిరమును బాగుచేయుటకై కాసెవారిని వడ్లవారిని, యెహోవా మందిరమును బలపరచుటకు ఇనుపపని యిత్తడిపని చేయువారిని కూలికి కుదిర్చిరి.
13
ఈలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి. వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దాని బలపరచిరి.
14
అది సిద్ధమైన తరువాత మిగిలిన ద్రవ్యమును రాజునొద్దకును యెహోయాదా యొద్దకును తీసికొనిరాగా వారు దాని చేత యెహోవా మందిరపు సేవయందు ఉపయోగపడు నట్లును, దహనబలుల నర్పించుటయందు ఉపయోగపడు నట్లును, ఉపకరణములను గరిటెలను వెండి బంగారముల ఉపకరణములను చేయించిరి. యెహోయాదాయున్న యన్నిదినములు యెహోవా మందిరములో దహనబలులు నిత్యమును అర్పింపబడెను.