అమజ్యా చేసిన యితర కార్యములు
2 దినవృత్తాంతములు 20:34

యెహోషాపాతు చేసిన కార్యములన్నిటినిగూర్చి హనానీ కుమారుడైన యెహూ రచించిన గ్రంథమందు వ్రాయబడియున్నది. ఈ యెహూ పేరు, ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు కనబడుచున్నది.

2 రాజులు 14:15

యెహోయాషు చేసిన యితర కార్యములను గూర్చియు, అతని పరాక్రమమును గూర్చియు యూదారాజైన అమజ్యాతో అతడు చేసిన యుద్ధమునుగూర్చియు ఇశ్రాయేలు రాజులవృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.