ఏడవ సంవత్సరమందు యెహోయాదా కావలికాయువారిమీదను రాజదేహ సంరక్షకులమీదను ఏర్పడియున్న శతా ధిపతులను పిలువనంపించి , యెహోవా మందిరములోనికి వారిని తీసికొని పోయి , యెహోవా మందిరమందు వారిచేత ప్రమాణము చేయించి వారితో నిబంధన చేసి , వారికి ఆ రాజు కుమారుని కనుపరచి యీలాగు ఆజ్ఞాపించెను
మీరు చేయవలసినదేమనగా , విశ్రాంతి దినమున లోపల ప్రవేశించు మీరు మూడు భాగములై యొక భాగము రాజ మందిరమునకు కావలి కాయువారై యుండవలెను;
ఒక భాగము సూరు గుమ్మముదగ్గర కాపు చేయవలెను, ఒక భాగము కాపు కాయువారి వెనుకటి గుమ్మమునొద్ద ఉండవలెను, ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకొని యుండవలెను.
మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీయందరిలో రెండు భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయువారై యుండవలెను.
మీలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేత పట్టుకొని రాజు చుట్టు కాచుకొని యుండవలెను, ఎవడైనను పంక్తులలో ప్రవేశించినయెడల వాని చంపవలెను , రాజు బయలుదేరి సంచరించునప్పుడెల్ల మీరు అతనియొద్ద ఉండవలెను .
శతా ధిపతులు యాజకుడైన యెహోయాదా తమ కిచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారము చేసిరి , ప్రతి మనిషి తన తన మనుష్యులను తీసికొని విశ్రాంతిదినమున లోపల ప్రవేశింపవలసిన వారితోను, విశ్రాంతిదినమున బయలుదేరవలసిన వారితోను కలిసి యాజకుడైన యెహోయాదా యొద్దకు వచ్చెను .
యాజకుడు మందిరములో ఉన్న దావీదు ఈటెలను డాళ్లను శతా ధిపతులకు అప్పగింపగా
కాపు కాయువారిలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేత పట్టుకొని బలిపీఠముచెంతను మందిరముచెంతను మందిరము కుడి కొన మొదలుకొని యెడమ కొన వరకు రాజు చుట్టు నిలిచిరి .
అప్పుడు యాజకుడు రాజ కుమారుని బయటకు తోడుకొనిపోయి అతని తలమీద కిరీటము పెట్టి , ధర్మశాస్త్రగ్రంథమును అతని చేతికిచ్చిన తరువాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లుకొట్టి రాజు చిరంజీవియగునుగాకని చాటించిరి .
అతల్యా , కాయువారును జనులును కేకలువేయగా విని , యెహోవా మందిరమందున్న జనుల దగ్గరకు వచ్చి
రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభము దగ్గర నిలుచుటయు , అధిపతులును బాకా ఊదువారును రాజు నొద్ద నిలువబడుటయు , దేశపు వారందరును సంతోషించుచు శృంగ ధ్వనిచేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొని ద్రోహము ద్రోహము అని కేక వేయగా
యాజకుడైన యెహోయాదా సైన్యములోని శతా ధిపతులకు యెహోవా మందిరమందు ఆమెను చంప కూడదు , పంక్తుల బయటికి ఆమెను వెళ్లగొట్టుడి ; ఆమె పక్షపువారిని ఖడ్గముచేత చంపుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక
రాజమందిరములోనికి గుఱ్ఱములు వచ్చు మార్గమున ఆమెకు దారి ఇచ్చిరి. ఆమె వెళ్లిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకొని చంపిరి.
పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను తమ పితరుల దేవుడైన యెహోవాయొద్ద తాము విచారణచేయుదు మనియు
దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసికొనెను .
వారు తమకిష్టము వచ్చినట్లు మా శరీరములమీదను మా పశువులమీదను అధికారము చూపుచున్నారు గనుక మాకు చాల శ్రమలు కలుగుచున్నవి.