మరియు అయిదు మూరల పొడుగు అయిదు మూరల వెడల్పుగల బలిపీఠమును తుమ్మకఱ్ఱతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను; దాని యెత్తు మూడు మూరలు.
దాని నాలుగు మూలలను దానికి కొమ్ములను చేయవలెను; దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను; దానికి ఇత్తడిరేకు పొదిగింపవలెను.
దాని బూడిదె ఎత్తుటకు కుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నియు ఇత్తడితో చేయవలెను.
మరియు వలవంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను.
ఆ వలమీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమివరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దాని నుంచవలెను.
మరియు బలిపీఠముకొరకు మోతకఱ్ఱలను చేయవలెను. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి ఇత్తడిరేకు పొదిగింపవలెను.
ఆ మోతకఱ్ఱలను ఆ ఉంగరములలో చొనపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకఱ్ఱలు దాని రెండుప్రక్కల నుండవలెను.
పలకలతో గుల్లగా దాని చేయవలెను; కొండమీద నీకు చూపబడిన పోలికగానే వారు దాని చేయవలెను.
మరియు అతడు తుమ్మ కఱ్ఱతో దహన బలిపీఠమును చేసెను . దాని పొడుగు అయిదు మూరలు దాని వెడల్పు అయిదు మూరలు , అది చచ్చౌకమైనది . దాని యెత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను కొమ్ములను చేసెను .
దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి ; దానికి ఇత్తడిరేకు పొదిగించెను .
అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణము లన్నిటిని , అనగా దాని బిందెలను దాని గరిటెలను దాని గిన్నెలను దాని ముండ్లను దాని అగ్ని పాత్రలను చేసెను . దాని ఉపకరణము లన్నిటిని ఇత్తడితో చేసెను
ఆ బలిపీఠము నిమిత్తము దాని జవ క్రింద దాని నడిమి వరకు లోతుగానున్న వల వంటి ఇత్తడి జల్లెడను చేసెను .
మరియు అతడు ఆ యిత్తడి జల్లెడయొక్క నాలుగు మూలలలో దాని మోతకఱ్ఱ లుండు నాలుగు ఉంగరములను పోతపోసెను .
ఆ మోతకఱ్ఱలను తుమ్మ కఱ్ఱతో చేసి వాటికి రాగిరేకులు పొదిగించెను .
ఆ బలిపీఠమును మోయుటకు దాని ప్రక్కల నున్న ఉంగరములలో ఆ మోతకఱ్ఱలు చొనిపెను ; పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను .
చూడుము ; నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరుగలవానిని పిలిచితిని .
అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసికొనగా అది అతనికి హూరును కనెను.
హూరు ఊరిని కనెను, ఊరి బెసలేలును కనెను.