మీరు చేయవలసినదేమనగా , విశ్రాంతి దినమున లోపల ప్రవేశించు మీరు మూడు భాగములై యొక భాగము రాజ మందిరమునకు కావలి కాయువారై యుండవలెను;
మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీయందరిలో రెండు భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయువారై యుండవలెను.
కాబట్టి లేవీయులును యూదావారందరును యాజకుడైన యెహోయాదా ఆజ్ఞ యంతటి ప్రకారము చేసిరి; యాజకుడైన యెహోయాదా వంతులవారికి సెలవియ్యలేదు గనుక ప్రతివాడు విశ్రాంతిదినమున బయటికి వెళ్లవలసిన తనవారిని ఆ దినమున లోపలికి రావలసిన తనవారిని తీసికొనివచ్చెను.