అంతకుముందొకడు పగపట్టక పరాకున తన పొరుగువాని చంపినయెడల
చంపినవాడు పారిపోవుటకు మోషే తూర్పుదిక్కున, యొర్దాను ఇవతల మూడు పురములను వేరుపరచెను. అట్టివాడెవడైనను ఆ పురములలో దేనిలోనికినైనను పారిపోయి బ్రదుకును.
అవేవనగా రూబేనీయులకు మైదానపు దేశారణ్యమందలి బేసెరును, గాదీయులకు గిలాదులో నున్న రామోతును, మనష్షీయులకు బాషానులోనున్న గోలాను అనునవే.
తూర్పుదిక్కున యొర్దాను అవతల యెరికోనొద్ద రూబేనీయుల గోత్రములోనుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసెరును, గాదీయుల గోత్రములోనుండి గిలాదులోని రామోతును, మనష్షీయుల గోత్రములోనుండి బాషానులోని గోలానును నియమించిరి.
రూబేను గోత్రికులనుండి నాలుగు పట్టణములను, అనగా బేసెరును దాని పొలమును యాహసును దాని పొలమును
రూబేను గోత్రికులనుండి నాలుగు పట్టణములను, అనగా బేసెరును దాని పొలమును యాహసును దాని పొలమును
కెదెమోతును దాని పొలమును మేఫాతును దాని పొలమును ఇచ్చిరి.