మెరారీయులకు
1దినవృత్తాంతములు 6:77-81
77

మరియు మెరారీయులలో శేషించినవారికి జెబూలూను గోత్రస్థానములోనుండి రిమ్మోను దాని గ్రామములు, తాబోరు దాని గ్రామములు,

78

యెరికోకు ఆవల యొర్దానునకు తూర్పుగా ఉండు రూబేను గోత్రస్థానములోనుండి అరణ్యములోని బేసెరు దాని గ్రామములు, యహజాయు దాని గ్రామములు,

79

కెదేమోతు దాని గ్రామములు, మేఫాతు దాని గ్రామములు,

80

గాదు గోత్ర స్థానములోనుండి గిలాదుయందలి రామోతు దాని గ్రామములు, మహనయీము దాని గ్రామములు,

81

హెష్బోను దాని గ్రామములు, యాజెరు దాని గ్రామములు, ఇయ్యబడెను.

ఆదికాండము 46:11

లేవి కుమారులైన గెర్షోను కహాతు మెరారి

సంఖ్యాకాండము 3:20

మెరారి కుమారుల వంశకర్తల పేళ్లు మాహలి మూషి. వారివారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు.

యెహొషువ 21:7

రూబేను గోత్రికులనుండియు, గాదు గోత్రికులనుండియు, జెబూలూను గోత్రికులనుండియు, వారి వంశములచొప్పున మెరారీయులకు కలిగినవి పండ్రెండు పట్టణములు.

యెహొషువ 21:34-40
34

లేవీయులలో మిగిలిన మెరారీయుల వంశములకు జెబూలూను గోత్రములనుండి నాలుగు పట్టణములను, అనగా యొక్నెయాము దాని పొలమును

35

కర్తాను దాని పొలమును దిమ్నాను దాని పొలమును నహలాలును దాని పొలమును ఇచ్చిరి.

36

రూబేను గోత్రికులనుండి నాలుగు పట్టణములను, అనగా బేసెరును దాని పొలమును యాహసును దాని పొలమును

37

కెదెమోతును దాని పొలమును మేఫాతును దాని పొలమును ఇచ్చిరి.

38

గాదు గోత్రికుల నుండి నాలుగు పట్టణములును, అనగా నరహంతకునికొరకు ఆశ్రయపట్టణమగు గిలాదులోని రామోతును దాని పొలమును మహనయీమును దాని పొలమును

39

హెష్బోనును దాని పొలమును యాజెరును దాని పొలమును ఇచ్చిరి.

40

వారి వారి వంశములచొప్పున, అనగా లేవీయుల మిగిలిన వంశములచొప్పున అవన్నియు మెరారీయులకు కలిగిన పట్టణములు. వంతుచీటివలన వారికి కలిగిన పట్టణములు పండ్రెండు.