గెర్షోను
1దినవృత్తాంతములు 6:71-76
71

మరియు గెర్షోమీయులకు మనష్షే అర్ధగోత్రవంశస్థానములోనుండి బాషానునందలి గోలాను దాని గ్రామములు, అష్తారోతు దాని గ్రామములు,

72

ఇశ్శాఖారు గోత్రస్థానములోనుండి కెదెషు దాని గ్రామములు, దాబెరతు దాని గ్రామములు,

73

రామోతు దాని గ్రామములు, ఆనేము దాని గ్రామములు,

74

ఆషేరు గోత్రస్థానములోనుండి మాషాలు దాని గ్రామములు, అబ్దోను దాని గ్రామములు,

75

హుక్కోకు దాని గ్రామములు రెహోబు దాని గ్రామములు;

76

నఫ్తాలి గోత్రస్థానములోనుండి గలిలయలోనున్న కెదెషు దాని గ్రామములు, హమ్మోను దాని గ్రామములు, కిర్యతాయిము దాని గ్రామములు ఇయ్యబడెను.

నిర్గమకాండము 2:22

ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అన్య దేశములో పరదేశినైయుంటిననుకొని వానికి గెర్షోము అనుపేరు పెట్టెను.

యెహొషువ 21:27-33
27

లేవీయుల వంశములలో గెర్షోనీయులకు రెండు పట్టణములను, అనగా నరహంతకునికొరకు ఆశ్రయపట్టణమగు బాషానులోని గోలానును దాని పొలమును బెయెష్టెరాను దాని పొలమును ఇచ్చిరి.

28

ఇశ్శాఖారు గోత్రికులనుండి నాలుగు పట్టణములను, అనగా కిష్యోనును దాని పొలమును దాబెరతును దాని పొలమును యర్మూతును దాని పొలమును

29

ఏన్గన్నీమును దాని పొలమును ఇచ్చిరి.

30

ఆషేరు గోత్రికులనుండి నాలుగు పట్టణములను, అనగా మిషెయలును దాని పొలమును అబ్దోనును దాని పొలమును

31

హెల్కతును దాని పొలమును రెహోబును దాని పొలమును ఇచ్చిరి.

32

నఫ్తాలి గోత్రికులనుండి మూడు పట్టణములను, అనగా నరహంతుకునికొరకు ఆశ్రయపట్టణమగు గలిలయలోని కెదెషును దాని పొలమును హమ్మోత్దోరును దాని పొలమును కర్తానును దాని పొలమును ఇచ్చిరి.

33

వారి వంశములచొప్పున గెర్షోనీయుల పట్టణములన్నియు వాటి పొలములుగాక పదమూడు పట్టణములు.