
ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహనయీములో నుండెను.
సౌలుయొక్క భార్యకు అహీనోయమని పేరు , ఈమె అహిమయస్సు కుమార్తె . అతని సైన్యా ధిపతి పేరు అబ్నేరు , ఇతడు సౌలునకు పినతండ్రియైన నేరు కుమారుడు .
సౌలు తండ్రియగు కీషును అబ్నేరు తండ్రియగు నేరును అబీయేలు కుమారులు .
అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు –సంగతి యెవరికి వినబడకుండ గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాటలాడవలెనని యోవాబు అతని పిలిచి, తన సహోదరుడగు అశాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడువగా అతడు చచ్చెను.
నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలననైనది కాదని ఆ దినమున జనులందరికిని ఇశ్రాయేలు వారికందరికిని తెలియబడెను.