హేమాను
1దినవృత్తాంతములు 6:33

ఈ ప్రకారము తమ కుమారులతో కలసి కనిపెట్టుచున్నవారెవరనగా, కహతీయుల కుమారులలో గాయకుడగు హేమాను; ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు

1దినవృత్తాంతములు 15:17

కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును, వాని బంధువులలో బెరెక్యా కుమారుడైన ఆసాపును, తమ బంధువులగు మెరారీయులలో కూషాయాహు కుమారుడైన ఏతానును,

1దినవృత్తాంతములు 15:19

పాటకులైన హేమానును ఆసాపును ఏతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయింపబడిరి.

1దినవృత్తాంతములు 16:41

యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతిచేయుటకై వీరితోకూడ హేమానును యెదూతూనును పేళ్లవరుసను ఉదాహరింపబడిన మరికొందరిని నియమించెను.

1దినవృత్తాంతములు 16:42

బూరలు ఊదుటకును తాళములను వాయించుటకును దేవునిగూర్చి పాడతగిన గీతములను వాద్యములతో వినిపించుటకును వీరిలోనుండు హేమానును యెదూతూనును అతడు నియమించెను.మరియు యెదూతూను కుమారులను అతడు ద్వార పాలకులుగా నియమించెను.

కీర్తనల గ్రంథము 88:1

యెహోవా , నాకు రక్షణకర్తవగు దేవా , రాత్రివేళ నేను నీ సన్నిధిని మొఱ్ఱపెట్టునాడు

Azareel
1దినవృత్తాంతములు 24:24

ఉజ్జీయేలు సంతతిలో మీకాయును మీకా సంతతిలో షామీరును,

షెబూయేలు
1దినవృత్తాంతములు 25:20

పదుమూడవది షూబాయేలు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

1దినవృత్తాంతములు 24:20

శేషించిన లేవీ సంతతివారెవరనగా అమ్రాము సంతతిలో షూబాయేలును, షూబాయేలు సంతతిలో యెహెద్యాహును,

షెబూయేలు
1దినవృత్తాంతములు 25:22

పదునయిదవది యెరేమోతు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

1దినవృత్తాంతములు 24:30

మూషి కుమారులు మహలి ఏదెరు యెరీమోతు,వీరు తమ పితరుల యిండ్లనుబట్టి లేవీయులు.

హోతీరు
1దినవృత్తాంతములు 25:28

ఇరువది యొకటవది హోతీరు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

1దినవృత్తాంతములు 25:30

ఇరువది మూడవది మహజీయోతు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.