ఎలియాజరు సంతతిలోని వారును, ఈతామారు సంతతివారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులగు అధికారులై యుండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లువేసి వంతులు పంచుకొనిరి.
లేవీయులలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడగు షెమయా రాజు ఎదుటను, అధిపతుల యెదుటను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు ఎదుటను, యాజకులయెదుటను, లేవీయుల యెదుటను, పితరుల యిండ్లపెద్దలైన వారి యెదుటను వారి పేళ్లు దాఖలు చేసెను; ఒక్కొక్క పాత్రలోనుండి యొక పితరుని యింటి చీటి ఎలియాజరు పేరటను ఇంకొకటి ఈతామారు పేరటను తీయబడెను.
ఎక్కువ మందికేమి తక్కువమందికేమి చీట్లు వేసి యెవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలెను.
తాము చేయు సేవ విషయములో పిన్నయని పెద్దయని గురువని శిష్యుడని భేదము లేకుండ వంతులకొరకై చీట్లువేసిరి.
చిన్నలకేమి పెద్దలకేమి పితరుల యింటి వరుసనుబట్టి యొక్కొక్క ద్వారము నొద్ద కావలియుండుటకై వారు చీట్లువేసిరి.