అమ్రాము
1దినవృత్తాంతములు 6:18

కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.

1దినవృత్తాంతములు 23:12-14
12

కహాతు కుమారులు నలుగురు, అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.

13

అమ్రాము కుమారులు అహరోను మోషే; అహరోనును అతని కుమారులును నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి.

14

దైవజనుడగు మోషే సంతతివారు లేవి గోత్రపువారిలో ఎంచబడిరి.

షూబాయేలు
1దినవృత్తాంతములు 23:16

గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు.

1దినవృత్తాంతములు 26:24

మోషే కుమారుడైన గెర్షోమునకు పుట్టిన షెబూయేలు బొక్కసముమీద ప్రధానిగా నియమింపబడెను.