యెష్షయి తన యేడుగురు కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు -యెహోవా వీరిని కోరుకొన లేదని చెప్పి
నీ కుమారు లందరు ఇక్కడనున్నారా అని యెష్షయిని అడుగగా అతడు-ఇంకను కడసారి వాడున్నాడు . అయితే వాడు గొఱ్ఱలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు -నీవు వాని పిలువనంపించుము , అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందమని యెష్షయితో చెప్పగా
దావీదు యూదా బేత్లెహేమువాడగు ఎఫ్రాతీయుడైన యెష్షయి అనువాని కుమారుడు .యెష్షయికి ఎనమండుగురు కుమాళ్లుండిరి . అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై యుండెను.
అయితే యెష్షయియొక్క ముగ్గురు పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయి యుండిరి. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమారుల పేరులు ఏవనగా, జ్యేష్ఠుడు ఏలీయాబు , రెండవవాడు అబీనాదాబు , మూడవవాడు షమ్మా ,
దావీదు కనిష్ఠుడు ; పెద్దవారైన ముగ్గురు సౌలు వెంటను పోయి యుండిరిగాని