
అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్గిలాదు కెదురుగా దిగినప్పుడు యాబేషు వారందరు -మేము నీకు సేవచేయుదుము, మాతో నిబంధనచేయుమని నాహాషుతో అనిరి
ఇశ్రాయేలీయులందరి మీదికి నింద తెచ్చునట్లు మీయందరి కుడి కన్నులను ఊడదీయుదునని మీతో నేను నిబంధన చేసెదనని అమ్మోనీయుడైన నాహాషు
అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే, మీ దేవుడైన యెహోవా మీకు రాజైయున్నను–ఆయన కాదు, ఒక రాజు మిమ్మును ఏలవలెనని మీరు నాతో చెప్పితిరి.
పిమ్మట అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడగు హానూను అతని రాజ్యము నేలుచుండెను.
దావీదు –హానూను తండ్రియైన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానూనునకుప్రత్యుపకారము చేతుననుకొని, అతని తండ్రి నిమిత్తము అతని నోదార్చుటకై తన సేవకులచేత సమాచారము పంపించెను. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశములోనికి రాగా
అమ్మోనీయుల ఘనులు తమ రాజగు హానూనుతో ఈలాగు మనవిచేసిరి –నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీయొద్దకు ఓదార్చువారిని పంపెనని నీవనుకొనుచున్నావా? ఈ పట్టణమును నాశము చేయవలెనని దాని శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తమే పంపించియున్నాడని నీకు తోచ లేదా?