ఈ ప్రకారము ఆమె పోయి కర్మెలు పర్వతమందున్న ఆ దైవ జనుని యొద్దకు వచ్చెను . దైవ జనుడు దూరమునుండి ఆమెను చూచి అదిగో ఆ షూనేమీయురాలు ;
అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలువారినందరిని, యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు నాలుగువందల ఏబదిమందిని, అషేరాదేవి ప్రవక్తలైన నాలుగువందల మందిని నాయొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పెను.
అహాబు భోజనము చేయబోయెను గాని, ఏలీయా కర్మెలు పర్వతముమీదికి పోయి నేలమీద పడి ముఖము మోకాళ్లమధ్య ఉంచుకొనెను.