ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఈలాగు సెలవిచ్చెను నీవు పోయి నీ నడుముమీది గోనెపట్ట విప్పి నీ పాదములనుండి జోళ్లు తీసివేయుము. అతడాలాగు చేసి దిగంబరియై జోళ్లు లేకయే నడచుచుండగా
యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూషును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను మూడు సంవత్సరములు దిగంబరియై జోడు లేకయే నడచుచున్న ప్రకారము
అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తమ దేశమునుండి కొనిపోబడిన కూషీయులను, పిన్నలను పెద్దలను, దిగంబరులనుగాను చెప్పులు లేనివారినిగాను పట్టుకొనిపోవును. ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదులమీది వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును.
నర పుత్రుడా , పెంకు ఒకటి తీసికొనివచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణపు రూపమును దాని మీద వ్రాయుము .
మరియు అది ముట్టడి వేయబడినట్లును దానియెదుట బురుజులను కట్టినట్లును దిబ్బ వేసినట్లును దాని చుట్టునున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములు న్నట్లును నీవు వ్రాయుము .
మరియు ఇనుపరేకొకటి తెచ్చి, నీకును పట్టణమునకును మధ్య ఇనుప గోడగా దానిని నిలువబెట్టి, నీ ముఖ దృష్టిని పట్టణము మీద ఉంచుకొనుము; పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును, నీవు దానిని ముట్టడివేయువాడవుగా ఉందువు; అది ఇశ్రాయేలీయులకు సూచనగా ఉండును.
మరియు నీ యెడమప్రక్కను పండుకొనియుండి ఇశ్రాయేలువారి దోషమును దానిమీద మోపవలెను; ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు.
ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించునట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్కచొప్పున నీకు మూడు వందల తొంబది దినములు నిర్ణయించియున్నాను .
ఆ దినములు గడచిన తరువాత కుడి ప్రక్కను పండుకొనియుండి నలువది దినములు యూదా వారి దోషమును భరింపవలెను , సంవత్సర మొకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించియున్నాను .
ఈలాగు నీవుండగా యెరూషలేము ముట్టడివేయబడినట్లు తేరిచూచుచు , చొక్కాయిని తీసివేసిన బాహువు చాపి దానినిగూర్చి ప్రకటింపవలెను .
పట్టణము ముట్టడివేయబడినట్లుండు దినములు నీవు రెండవ ప్రక్కను తిరు గక అదేపాటున ఉండునట్లు నిన్నుకట్లతో బంధింతును .
మరియు నీవు గోధుమలును యవలును కాయధాన్యములును చోళ్లును సజ్జలును తెల్ల జిలకరను తెచ్చుకొని , యొక పాత్రలో ఉంచి , నీవు ఆ ప్రక్క మీద పండుకొను దినముల లెక్కచొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను , మూడు వందల తొంబది దినములు నీవు ఈలాగున భోజనము చేయుచు రావలెను ;
నీవు తూనికె ప్రకారము , అనగా దినమొకటింటికి ఇరువది తులముల యెత్తుచొప్పున భుజింపవలెను , వేళ వేళకు తినవలెను ,
మరియు నరపుత్రుడా, నీవు మంగలకత్తివంటి వాడిగలకత్తియొకటి తీసికొని నీ తలను గడ్డమును క్షౌరముచేసికొని, త్రాసు తీసికొని ఆ వెండ్రుకలను తూచి భాగములు చేయుము.
పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి మూడవ భాగమును కాల్చి, రెండవ భాగమును తీసి ఖడ్గముచేత హతముచేయు రీతిగా దానిని చుట్టు విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము; నేను ఖడ్గముదూసి వాటిని తరుముదును.
అయితే వాటిలో కొన్నిటిని తీసికొని నీ చెంగున కట్టుకొనుము;
పిమ్మట వాటిలో కొన్నిటిని మరల తీసి అగ్నిలోవేసి కాల్చుము; దానినుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు వారినందరిని తగులబెట్టును.
మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ... యీలాగు సెలవిచ్చెను
నర పుత్రుడా , తిరుగుబాటు చేయువారి మధ్య నీవు నివసించుచున్నావు ; వారు ద్రోహులై యుండి, చూచుకన్నులు కలిగియు చూ డక యున్నారు; విను చెవులు కలిగియు వి నకయున్నారు .
నర పుత్రుడా , దేశాంతరము పోవువానికి తగిన సామగ్రిని మూటకట్టుకొని , పగటివేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై , నీవున్న స్థలమును విడిచి వారు చూచుచుండగా మరియొక స్థలమునకు పొమ్ము; వారు తిరుగుబాటు చేయువారు, అయినను దీని చూచి విచారించుకొందురేమో
దేశాంతరము పోవువాడు తన సామగ్రిని తీసికొనునట్లు వారు చూచుచుండగా నీ సామగ్రిని పగటి యందు బయటికి తీసికొనివచ్చి వారు చూచుచుండగా అస్తమానమున ప్రయాణమై పరదేశమునకు పోవువానివలె నీవు బయలుదేరవలెను
వారు చూచుచుండగా గోడకు కన్నమువేసి నీ సామగ్రిని తీసికొని దాని ద్వారా బయలుదేరుము
వారు చూచుచుండగా రాత్రియందు మూట భుజము మీద పెట్టుకొని నేల కనబడ కుండ నీ ముఖము కప్పుకొని దానిని కొనిపొమ్ము , నేను ఇశ్రాయేలీయులకు నిన్ను సూచనగా నిర్ణయించితిని .
ఆయన నా కాజ్ఞాపించినట్లు నేను చేసితిని , ఎట్లనగా నేను దేశాంతరము పోవువాడనైనట్టుగా పగటియందు నా సామగ్రిని బయటికి తెచ్చి అస్తమయమున నా చేతితో గోడకు కన్నమువేసి వారు చూచుచుండగా సామగ్రిని తీసికొని మూట భుజము మీద పెట్టుకొంటిని
పాత్రలన్నియు నిండిన తరువాత ఇంక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమియు లేవని చెప్పెను . అంతలొ నూనె నిలిచి పోయెను.
మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి; మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి,