ఈ జీవులను నేను చూచుచుండగా నేలమీద ఆ నాలుగింటి యెదుట ముఖముల ప్రక్కను చక్రమువంటి దొకటి కనబడెను .
ఆ చక్రములయొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతివలె నుండెను , ఆ నాలుగును ఒక్క విధముగానే యుండెను . వాటి రూపమును పనియు చూడగా చక్రము లో చక్రమున్నట్టుగా ఉండెను .
అవి జరుగునప్పుడు నాలుగు ప్రక్కలకు జరుగుచుండెను , వెనుకకు తిరుగకయే జరుగుచుండెను .
వాటి కైవారములు మిక్కిలి యెత్తుగలవై భయంకరముగా ఉండెను , ఆ నాలుగు కైవారములు చుట్టు కండ్లతో నిండి యుండెను .
ఆ జీవులు కదలగా ఆ చక్రములును వాటి ప్రక్కను జరిగెను , అవి నేల నుండి లేచినప్పుడు చక్రములుకూడ లేచెను .
ఆత్మ యెక్కడికి పోవునో అక్కడికే , అది పోవలసిన వైపునకే అవియు పోవుచుండెను ; జీవికున్న ఆత్మ , చక్రములకును ఉండెను గనుక అవి లేవగానే చక్రములును లేచుచుండెను .
జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక జీవులు జరుగగా చక్రములును జరుగుచుండెను , అవి నిలువగా ఇవియు నిలిచెను , అవి నేల నుండి లేవగా ఇవియు వాటితోకూడ లేచెను .
మరియు ఆ జంతువుల రెక్కలు ఒక దానికొకటి తగులుటవలన కలుగు చప్పుడును వాటి ప్రక్కనున్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగు చున్నట్లుగా నాకు వినబడెను
ఆ నాలుగు చక్రములు ఏకరీతిగానుండి యొక్కొక చక్రమునకులోగా మరియొక చక్రమున్నట్టుగా కనబడెను.
అవి జరుగుచుండగా నాలుగు వైపులు జరుగుచున్నట్లుండెను, వెనుకకు తిరుగక జరుగుచుండెను, తల యేతట్టు తిరుగునో అవి ఆ తట్టే దానివెంట పోవుచుండెను, వెనుకకు తిరుగక జరుగుచుండెను.
ఆ నాలుగు కెరూబులయొక్క శరీరములును వీపులును చేతులును రెక్కలును ఆ చక్రములచుట్టును కన్నులతో నిండియుండెను; నాలుగింటికి చక్రములుండెను.
నేను వినుచుండగా తిరుగుడని చక్రములకు ఆజ్ఞ యియ్యబడెను.