ఇక్కడ లేడా
2 రాజులు 3:11-13
11

యెహోషాపాతు అతనిద్వారా మనము యెహోవాయొద్ద విచారణచేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని యడిగెను. అంతట ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలీయా చేతులమీద నీళ్లు పోయుచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా

12

యహోషాపాతు యెహోవా ఆజ్ఞ యితని ద్వారా మనకు దొరుకుననెను. ఇశ్రాయేలు రాజును యెహోషాపాతును ఎదోము రాజును అతని యొద్దకు పోగా

13

ఎలీషా ఇశ్రాయేలు రాజును చూచి నాతో నీకు నిమిత్తమేమి? నీ తలి దండ్రులుంచుకొనిన ప్రవక్తలయొద్దకు పొమ్మని చెప్పెను.ఆలాగనవద్దు, మోయాబీయుల చేతికి అప్పగింపవలెనని యెహోవా, రాజులమైన మా ముగ్గురిని పిలిచెనని ఇశ్రాయేలు రాజు అతనితో అనినప్పుడు

2 దినవృత్తాంతములు 18:6

అయితే యెహోషాపాతు మనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా? అని యడుగగా

2 దినవృత్తాంతములు 18:7

ఇశ్రాయేలు రాజు యెహోవా యొద్ద విచారణచేయుటకు ఇవ్లూ కుమారుడైన మీకాయా అను ఒకడు ఇచ్చట ఉన్నాడు; అయితే అతడు నన్నుగూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు గనుక నేను వానియందు పగ గలిగియున్నాననగా యెహోషాపాతు రాజు ఆలాగ నవద్దనెను.