కావున మనము అతనికి గోడమీద ఒక చిన్న గది కట్టించి , అందులో అతని కొరకు మంచము , బల్ల , పీట దీప స్తంభము నుంచుదము ; అతడు మనయొద్దకు వచ్చునప్పుడెల్ల అందులో బసచేయవచ్చునని చెప్పెను .
అప్పుడు ఆమె పిల్లవానిని దైవ జనుని మంచము మీద పెట్టి తలుపువేసి బయటికి వచ్చి
ఎలీషా ఆ యింట జొచ్చి , బాలుడు మరణమైయుండి తన మంచము మీద పెట్టబడి యుండుట చూచి
ఆ దినములయందామె కాయిలాపడి చనిపోగా, వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి.