A. M. 2964. B.C. 1040. And after
2 సమూయేలు 7:9

నీవు పోవు చోట్లనెల్లను నీకు తోడుగానుండి నీ శత్రువులనందరిని నీ యెదుట నిలువకుండ నిర్మూలముచేసి, లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసియున్నాను.

2 సమూయేలు 21:15-22
15

ఫిలిష్తీయులకును ఇశ్రాయేలీయులకును యుద్ధము మరల జరుగగా దావీదు తన సేవకులతోకూడ దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయునప్పుడు అతడు సొమ్మసిల్లెను.

16

అప్పుడు రెఫాయీయుల సంతతివాడగు ఇష్బిబేనోబ అను ఒకడు ఉండెను. అతడు ధరించియున్న ఖడ్గము క్రొత్తది, వాని యీటె మూడువందల తులముల యెత్తు యిత్తడిగలది నేను దావీదును చంపెదనని అతడు చెప్పియుండెను.

17

సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీనిచూచి, ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇకమీదట మాతోకూడ యుద్ధమునకు రావద్దని అతనిచేత ప్రమాణము చేయించిరి.

18

అటుతరువాత ఫిలిష్తీయులతో గోబుదగ్గర మరల యుద్ధము జరుగగా హూషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతివాడగు సఫును చంపెను.

19

తరువాత గోబుదగ్గర ఫిలిష్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరుగగా అక్కడ బేత్లెహేమీయుడైన యహరేయోరెగీము కుమారుడగు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుని చంపెను; వాని యీటెకఱ్ఱ నేతగాని దోనె అంత గొప్పది.

20

ఇంకొక యుద్ధము గాతుదగ్గర జరిగెను. అక్కడ మంచి యెత్తరి యొకడుండెను, ఒక్కొక చేతికి ఆరేసి వ్రేళ్లును, ఇరువది నాలుగు వ్రేళ్లు అతని కుండెను. అతడు రెఫాయీయుల సంతతివాడు.

21

అతడు ఇశ్రాయేలీయులను తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతనిని చంపెను.

22

ఈ నలుగురును గాతులోనున్న రెఫాయీయుల సంతతివారై దావీదువలనను అతని సేవకులవలనను హతులైరి.

మెతెగమ్మా
2 సమూయేలు 2:24

యోవాబును అబీషైయును అబ్నేరును తరుముచు గిబియోనను అరణ్యమార్గములోని గీహ యెదుటి అమ్మాయను కొండకు వచ్చిరి; అంతలో సూర్యుడు అస్తమించెను.

1దినవృత్తాంతములు 18:1-17
1

వారిని లోపరచి, గాతు పట్టణమును దాని గ్రామములును ఫిలిష్తీయుల వశమున నుండకుండ వాటిని పట్టుకొనెను.

2

అతడు మోయాబీయులను జయించగా వారు దావీదునకు కప్పముకట్టు దాసులైరి.

3

సోబా రాజైన హదరెజెరు యూఫ్రటీసునదివరకు తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా హమాతునొద్ద దావీదు అతనిని ఓడించి

4

అతని యొద్దనుండి వెయ్యి రథములను ఏడువేల గుఱ్ఱపు రౌతులను ఇరువదివేల కాల్బలమును పట్టుకొనెను. దావీదు ఆ రథములలో నూరింటికి కావలసిన గుఱ్ఱములను ఉంచుకొని కడమవాటికన్నిటికి చీలమండ నరములు తెగవేయించెను.

5

సోబారాజైన హదరెజెరునకు సహాయము చేయవలెనని దమస్కులోని సిరియనులు రాగా దావీదు ఆ సిరియనులలో ఇరువదిరెండు వేలమందిని హతముచేసెను.

6

తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను; సిరియనులు దావీదునకు కప్పముకట్టు సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్లనెల్ల యెహోవా అతనికి సహాయముచేయుచు వచ్చెను.

7

మరియు హదరెజెరు సేవకులు పట్టుకొనియున్న బంగారు డాళ్లను దావీదు తీసికొని యెరూషలేమునకు చేర్చెను.

8

హదరెజెరుయొక్క పట్టణములైన టిబ్హతులో నుండియు, కూనులోనుండియు దావీదు బహు విస్తారమైన యిత్తడిని తీసికొని వచ్చెను. దానితో సొలొమోను ఇత్తడి సముద్రమును స్తంభములును ఇత్తడి వస్తువులను చేయించెను.

9

దావీదు సోబారాజైన హదరెజెరుయొక్క సైన్యమంతటిని ఓడించిన వర్తమానము హమాతు రాజైన తోహూకు వినబడెను.

10

హదరెజెరునకును తోహూకును విరోధము కలిగియుండెను గనుక రాజైన దావీదు హదరెజెరుతో యుద్ధముచేసి అతని నోడించినందుకై దావీదుయొక్క క్షేమము తెలిసికొనుటకును, అతనితో శుభవచనములుపలుకుటకును, బంగారముతోను వెండితోను ఇత్తడితోను చేయబడిన సకల విధములైన పాత్రలనిచ్చి, తోహూ తన కుమారుడైన హదోరమును అతనియొద్దకు పంపెను.

11

ఈ వస్తువులను కూడ రాజైన దావీదు తాను ఎదోమీయులయొద్దనుండియు, మోయాబీయులయొద్దనుండియు, అమ్మోనీయులయొద్ద నుండియు, ఫిలిష్తీయుల యొద్దనుండియు, అమాలేకీయులయొద్ద నుండియు తీసికొనిన వెండి బంగారములతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించెను.

12

మరియు సెరూయా కుమారుడైన అబీషై ఉప్పులోయలో ఎదోమీయులలో పదునెనిమిది వేల మందిని హతము చేసెను.

13

దావీదు ఎదోములో కావలి సైన్యమును ఉంచెను, ఎదోమీయులందరును అతనికి సేవకులైరి, దావీదు పోయిన చోట్లనెల్ల యెహోవా అతని రక్షించెను.

14

ఈ ప్రకారము దావీదు ఇశ్రాయేలీయులందరిమీదను రాజైయుండి తన జనులందరికిని నీతిన్యాయములను జరిగించెను.

15

సెరూయా కుమారుడైన యోవాబు సైన్యాధిపతియై యుండెను; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్యపుదస్తావేజులమీద నుండెను;

16

అహీటూబు కుమారుడైన సాదోకును అబ్యాతారు కుమారుడైన అబీమెలెకును యాజకులు, షవ్షా శాస్త్రి;

17

యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతియై యుండెను; మరియు దావీదుయొక్క కుమారులు రాజునకు సహాయులై యుండిరి.