ఆశీర్వదించెను
ఆదికాండము 30:27

అందుకు లాబాను అతనితో - నీ కటాక్షము నా మీదనున్న యెడల నా మాట వినుము; నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలిసికొంటినని చెప్పెను.

ఆదికాండము 39:5

అతడు తన యింటిమీదను తనకు కలిగినదంతటిమీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని యింటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము యింటిలో నేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను.

ఆదికాండము 39:23

యెహోవా అతనికి తోడైయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిగూర్చియు విచారణ చేయకయుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను.

సామెతలు 3:9

నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము.

సామెతలు 3:10

అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగానుండును నీ గానుగులలోనుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలిపారును.

మలాకీ 3:10

నా మందిరము లో ఆహార ముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి ; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి ,పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు .