అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరును ఆ యేటియొద్దనున్న పురము మొదలుకొని గిలాదువరకు మనకు అసాధ్యమైన నగర మొకటియు లేకపోయెను. మన దేవుడైన యెహోవా అన్నిటిని మనకు అప్పగించెను.
అది ఏదనగా అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయమధ్యనున్న పట్టణమునుండి దీబోను వరకు మేదెబా మైదానమంతయు, అమ్మోనీయుల సరిహద్దు వరకు హెష్బోనులో ఏలికయు
వారి సరిహద్దు ఏదనగా, అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణమునుండి మేదెబాయొద్దనున్న మైదానమంతయు
అరోయేరులోను షిప్మోతులోను ఎష్తెమోలోను
దమస్కు పట్టణము కాకపోవలసివచ్చెను అది పాడై దిబ్బగానగును అరోయేరు పట్టణములు నిర్మానుష్యములగును అవి గొఱ్ఱల మందలు మేయు తావులగును ఎవడును వాటిని బెదరింపకుండ మందలు అచ్చట పండుకొనును.
రూబేనీయులకును గాదీయులకును అతివిస్తారమైన మందలుండెను గనుక యాజెరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలిసికొని
అతారోతు దీబోను యాజెరు నిమ్రా హెష్బోను ఏలాలే షెబాము నెబో బెయోను అనుస్థలములు, అనగా
యాజెరు యొగ్బెహ బేత్నిమ్రా బేత్హారాను
ఏలయనగా హెష్బోను పొలములు సిబ్మా ద్రాక్షావల్లులు వాడిపోయెను దాని శ్రేష్ఠమైన ద్రాక్షావల్లులను జనముల అధికారులు అణగద్రొక్కిరి. అవి యాజరువరకు వ్యాపించెను అరణ్యములోనికి ప్రాకెను దాని తీగెలు విశాలముగా వ్యాపించి సముద్రమును దాటెను.
అందువలన యాజరు ఏడ్చినట్టు నేను సిబ్మా ద్రాక్షావల్లుల నిమిత్తము ఏడ్చెదను హెష్బోనూ, ఏలాలే, నా కన్నీళ్లచేత నిన్ను తడిపెదను ఏలయనగా ద్రాక్షతొట్టి త్రొక్కి సంతోషించునట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలములమీదను నీ కోత మీదను పడి కేకలు వేయుదురు.