మరియు సైన్యములకు చేరిన వేరు పరాక్రమశాలు లెవరనగా యోవాబు తమ్ముడైన అశాహేలు; బేత్లెహేము ఊరివాడైన దోదో కుమారుడగు ఎల్హానాను,
మరల ఫిలిష్తీయులతో యుద్ధము జరుగగా యాయీరు కుమారుడైన ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడగు లహ్మీని చంపెను. వాని యీటె నేత గాని దోనెయంత పెద్దది.
గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరు చుండెను. అతడు ఆరు మూళ్ల జేనెడు ఎత్తుమనిషి .
అతని తల మీద రాగి శిరస్త్రాణముండెను , అతడు యుద్ధకవచము ధరించియుండెను , ఆ కవచము అయిదు వేల తులముల రాగి యెత్తుగలది .
మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి బల్లెమొకటి యుండెను.
అతని యీటె కఱ్ఱ నేతగాని దోనె అంత పెద్దది; మరియు అతని యీటె కొన ఆరు వందల తులముల యినుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను .
అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండువారిని పిలిచి -యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి ?నేను ఫిలిష్తీయుడను కానా ? మీరు సౌలు దాసులుకారా ? మీ పక్షముగా ఒకనిని ఏర్పరచుకొని అతని నాయొద్దకు పంపుడి ;
అతడు నాతో పోట్లాడి నన్ను చంప గలిగిన యెడల మేము మీకు దాసుల మగుదుము ; నేనతని జయించి చంపిన యెడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు .
ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను . ఒకని నియమించిన యెడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచువచ్చెను .
సౌలును ఇశ్రాయేలీయు లందరును ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులైరి .