అబ్షాలోము యోవాబునకు మారుగా అమాశాను సైన్యాధిపతిగా నియమించెను. ఈ అమాశా ఇత్రా అను ఇశ్రాయేలీయుడు యోవాబు తల్లియైన సెరూయా సహోదరియగు నాహాషు కుమార్తెయైన అబీగయీలు నొద్దకు పోయి నందున పుట్టినవాడు
మరియు అమాశా యొద్దకు దూతలను పంపి నీవు నాకు ఎముక నంటిన బంధువుడవు మాంసము నంటిన బంధువుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను ఖాయపరచనియెడల దేవుడు గొప్ప అపాయము నాకు కలుగజేయును గాకని చెప్పుడనెను.
అబీగయీలు అమాశాను కనెను; ఇష్మాయేలీయుడైన యెతెరు అమాశాకు తండ్రి.