కాబట్టి యెజ్రెయేలీయురాలగు అహీనోయము, కర్మెలీయుడగు నాబాలునకు భార్యయైన అబీగయీలు అను తన యిద్దరు భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయెను.
1 సమూయేలు 25:42

త్వరగా లేచి గార్దభము మీద ఎక్కి తన వెనుక నడచుచున్న అయిదుగురు పనికత్తెలతో కూడ దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెండ్లి చేసికొనెను .

1 సమూయేలు 25:43

మరియు దావీదు యెజ్రెయేలు స్త్రీయైన అహీనోయమును పెండ్లి చేసికొనియుండెను; వారిద్దరు అతనికి భార్యలుగా ఉండిరి .

1 సమూయేలు 30:5

యజ్రెయేలీయురాలైన అహీనోయము , కర్మెలీయుడైన నాబాలు భార్యయయిన అబీగయీలు అను దావీదు ఇద్దరు భార్యలును చెరలోనికి కొనిపోబడగా చూచి

లూకా 22:28

నా శోధనలలో నాతో కూడ నిలిచి యున్నవారు మీరే;

లూకా 22:29

గనుక నాతండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్లయొద్ద అన్నపానములు పుచ్చుకొని,