అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో నీవు మా యెడల చూపిన మర్యాద యెట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్మునేల పిలువలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి.
ఎఫ్రాయిమీయులు కూడుకొని ఉత్తరదిక్కునకు పోయి నీవు అమ్మోనీయులతో యుద్ధము చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మమ్ము నేల పిలువ లేదు? నీవు కాపురమున్న నీ యింటిని అగ్నితో కాల్చివేయుదుమని యెఫ్తాతో చెప్పగా
ఆయన సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు.
యేసు నా సమయ మింకను రాలేదు; మీ సమయమెల్లప్పుడును సిద్ధముగానే యున్నది.
నాటి విజయము జనులకందరికి దుఃఖమునకు కారణమాయెను.
అప్పుడు లాబాను యాకోబుతో నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి, కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేల?
నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేల? సంభ్రమముతోను పాటలతోను మద్దెలతోను సితారాలతోను నిన్ను సాగనంపుదునే.