మరియు షెకెము మీ కటాక్షము నా మీద రానీయుడి; మీరేమి అడుగుదురో అది యిచ్చెదను.
వారు నీవు మమ్ము బ్రదికించితివి, ఏలినవారి కటాక్షము మా మీదనుండనిమ్ము; ఫరోకు దాసులమగుదుమని చెప్పిరి.
అందుకు ఆమె నా యేలిన వాడా , నేను నీ పనికత్తెలలో ఒకదానను కాక పోయినను , నీవు నన్నాదరించి నీ దాసురాలినగు నాయందు ప్రేమగలిగి మాటలాడితివి గనుక నాయెడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పెను .
నీ పనివారిని నీవు అడిగినయెడల వారాలాగు చెప్పుదురు . కాబట్టి నా పనివారికి దయ చూపుము . శుభ దినమున మేము వచ్చితివిు గదా ; నీ కిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము .
అందుకు రాజు మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదేయని సీబాతో చెప్పగా సీబా నా యేలినవాడా రాజా, నీ దృష్టియందు నేను అనుగ్రహము పొందుదునుగాక, నేను నీకు నమస్కారము చేయుచున్నాననెను.