యాకోబు రాహేలును ప్రేమించి - నీ చిన్న కుమార్తెయైన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువుచేసెదననెను.
రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో - నన్ను పంపివేయుము; నా చోటికిని నా దేశమునకును వెళ్లెదను.
నా భార్యలను నా పిల్లలను నా కప్పగించుము; అప్పుడు నేను వెళ్లెదను; వారి కోసము నీకు కొలువు చేసితిని; నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువుగదా అని చెప్పెను.
అతడు మమ్మును అమి్మవేసి, మాకు రావలసిన ద్రవ్యమును బొత్తుగా తినివేసెను.
ఇదివరకు నీ యింటిలో ఇరువది యేండ్లు ఉంటిని. నీ యిద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలు గేండ్లును, నీ మంద నిమిత్తము ఆరేండ్లును నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము పదిమారులు మార్చితివి.
సౌలు-నా చెయ్యి వానిమీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వానిమీద పడును గాక అనుకొని-దావీదూ, నా పెద్ద కుమార్తెయైన మేరబును నీకిత్తును; నీవు నా పట్ల యుద్ధశాలివై యుండి యెహోవా యుద్ధములను జరిగింపవలె ననెను.
అందుకు దావీదు -రాజునకు అల్లుడ నగుటకు నే నెంతటివాడను ? నా స్థితియైనను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏపాటివని సౌలు తో అనెను .
అయితే సౌలు కుమార్తెయైన మేరబును దావీదునకు ఇయ్యవలసి యుండగా సౌలు ఆమెను మెహోలతీయుడైన అద్రీయేలు కిచ్చి పెండ్లి చేసెను.
అయితే తన కుమార్తెయైన మీకాలు దావీదు మీద ప్రేమ గలిగియుండగా సౌలు విని సంతోషించి ,
ఆమె అతనికి ఉరిగా నుండునట్లును ఫిలిష్తీయుల చెయ్యి అతనిమీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తు ననుకొని -ఇప్పుడు నీవు మరి యొకదానిచేత నాకు అల్లుడవగుదువని దావీదు తో చెప్పి
తన సేవకులను పిలిపించి-మీరు దావీదు తో రహస్యముగా మాటలాడి -రాజు నీయందు ఇష్టము గలిగియున్నాడు, అతని సేవకు లందరును నీయెడల స్నేహముగా నున్నారు, కాబట్టి నీవు రాజునకు అల్లుడవు కావలెనని చెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను.
సౌలు సేవకులు ఆ మాటలనుబట్టి దావీదుతో సంభాషింపగా దావీదు -నేను దరిద్రుడనై యెన్నికలేని వాడనై యుండగా రాజునకు అల్లుడనగుట స్వల్ప విషయమని మీకు తోచునా ? అని వారితో అనగా
సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియజేసిరి .
అందుకు సౌలు ఫిలిష్తీయుల చేత దావీదును పడగొట్టవలెనన్న తాత్పర్యము గలవాడై-రాజు ఓలిని కోరక రాజు శత్రువులమీద పగతీర్చుకొనవలెనని ఫిలిష్తీయుల నూరు ముందోళ్లు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను .
సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియజేయగా తాను రాజునకు అల్లుడు కావలెనన్న కోరిక గలవాడై
గడువుదాటక మునుపే లేచి తనవారితో పోయి ఫిలిష్తీయులలో రెండువందల మందిని హతముచేసి వారి ముందోళ్లు తీసికొనివచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తిచేసి అప్పగింపగా సౌలు తన కుమార్తెయైన మీకాలును అతనికిచ్చి పెండ్లిచేసెను.
యాకోబు తప్పించుకొని సిరియా దేశములోనికి పోయెను, భార్య కావలెనని ఇశ్రాయేలు కొలువు చేసెను, భార్య కావలెనని అతడు గొఱ్ఱలు కాచెను .