
ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడ లేక తనస్థలమందు పండుకొనియుండగాను
మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము.
ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా, అని అతని పిలువగా అతడు–చిత్తము నాయనా అని అతనితో ననెను.