ఆరువందల
1 సమూయేలు 22:2

మరియు ఇబ్బందిగల వారందరును, అప్పులు చేసికొనిన వారందరును, అసమాధానముగా నుండు వారందరును, అతనియొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి యాయెను. అతనియొద్దకు ఎక్కువ తక్కువ నాలుగు వందల మంది వచ్చియుండిరి.

1 సమూయేలు 25:13

అంతట దావీదు వారితో -మీరందరు మీ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొనిరి, దావీదు కూడను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు నాలుగు వందల మంది బయలుదేరగా రెండువందల మంది సామాను దగ్గర నిలిచిరి.

1 సమూయేలు 30:9

కాబట్టి దావీదు అతనియొద్దనున్న ఆరు వందల మందియును బయలుదేరి బెసోరు వాగు గట్టుకు రాగా వారిలో రెండువందల మంది వెనుక దిగవిడువబడిరి.

1 సమూయేలు 30:10

దావీదును నాలుగు వందల మందియును ఇంక తరుముచు పోయిరి గాని ఆ రెండువందల మంది అలసట పడి బెసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ నాలుగు వందలమంది పోవుచుండగా