
దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతనియెదుట నిలువబడగా అతనియందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను, అతడు సౌలు ఆయుధములను మోయు వాడాయెను.
అంతట సౌలు -దావీదు నా అనుగ్రహము పొందెను గనుక అతడు నా సముఖమందు సేవచేయుటకు ఒప్పుకొనుమని యెష్షయి కి వర్తమానము పంపెను.
దేవునియొద్దనుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్ల దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురా త్మ అతనిని విడిచిపోయెను, అతడు సేదదీరి బాగాయెను.
దావీదు బేత్లెహేములో తన తండ్రి గొఱ్ఱలను మేపుచు సౌలు నొద్దకు తిరిగి పోవుచు వచ్చుచు నుండెను.