
దావీదు యూదా బేత్లెహేమువాడగు ఎఫ్రాతీయుడైన యెష్షయి అనువాని కుమారుడు.యెష్షయికి ఎనమండుగురు కుమాళ్లుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై యుండెను.
చిత్తగించుము, బేత్లెహేమీయుడైన యెష్షయియొక్క కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహు శూరుడును యుద్ధ శాలియు మాట నేర్పరియు రూపసియునై యున్నాడు, మరియు యెహోవా వానికి తోడుగానున్నాడనగా
సౌలు -యెష్షయి యొద్దకు దూతలను పంపి, గొఱ్ఱలయొద్ద నున్న నీ కుమారుడైన దావీదును నాయొద్దకు పంపుమనెను.