
అందుకు ఫిలిష్తీయుల సర్దారులు అతనిమీద కోపపడి -ఈ మనుష్యుని నీవు నిర్ణయించిన స్థలము నకు తిరిగి పోనిమ్ము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రా కూడదు, యుద్ధమందు అతడు మనకు విరోధి యవు నేమో, దేనిచేత అతడు తన యజమానుని తో సమాధానపడును? మనవారి తలలను ఛేదించి తీసికొని పోవుటచేతనే గదా తన యజమానునితో సమాధానపడును.
నఫ్తాలి గోత్రములోనుండియు, ఆషేరు గోత్రములోనుండియు, మనష్షే గోత్రమంతటిలోనుండియు పిలిపింపబడిన ఇశ్రాయేలీయులు కూడుకొని మిద్యానీయులను తరిమిరి.