
వారు యొర్దానులో నుండి తెచ్చిన పండ్రెండు రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించి
ఏహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడ గదిలో కూర్చుండియుండెను. ఏహూదు– నీతో నేను చెప్పవలసిన దేవునిమాట ఒకటి యున్నదని చెప్పగా అతడు తన పీఠముమీదనుండి లేచెను.
అప్పుడతడు—అధిపతీ, నీకొక సమాచారము తెచ్చితినని చెప్పగా యెహూ— యిందరిలో అది ఎవరిని గూర్చినదని అడుగగా అతడు—అధిపతీ నిన్ను గూర్చినదే యనెను; అందుకు యెహూ లేచి యింటిలో ప్రవేశించెను.
అప్పుడు ఆ యౌవనుడు అతని తలమీద తైలము పోసి అతనితో ఇట్లనెను–ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా–యెహోవా జనులైన ఇశ్రాయేలు వారిమీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను.
శతాధిపతి సహస్రాధిపతియొద్ద కతని తోడుకొనిపోయి ఖైదీయైన పౌలు నన్ను పిలిచి నీతో ఒక మాట చెప్పుకొనవలెననియున్న యీ పడుచువానిని నీయొద్దకు తీసికొనిపొమ్మని నన్ను అడిగెనని చెప్పెను.
సహస్రాధిపతి అతని చెయ్యి పట్టుకొని అవతలకు తీసికొనిపోయి నీవు నాతో చెప్పుకొనవలెనని యున్నదేమని యొంటరిగా అడిగెను.
అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచినవారందరి యెదుట తన్ను తాను అణచుకొనజాలక– నా యొద్దనుండి ప్రతి మనుష్యుని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియచేసికొనినప్పుడు ఎవరును అతని యొద్ద నిలిచియుండలేదు.