ఆత్మసంబంధమైన
లూకా 24:31

వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను.

యోహాను 20:19

ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న యింటి తలుపులు మూసికొనియుండగా యేసు వచ్చి మధ్యను–నిలిచిమీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను.

యోహాను 20:26

ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడ ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచి–మీకు సమాధానము కలుగును గాక అనెను.