
ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.
ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకము లో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యు లందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.
ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకము లో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింప బడదు.
అయినను ఆదాముచేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారిమీద కూడ, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణ మేలెను; ఆదాము రాబోవు వానికి గురుతై యుండెను,
అయితే అపరాధము కలిగినట్టు కృపా వరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధమువలన అనేకులు చనిపోయిన యెడల మరి యెక్కువగా దేవుని కృపయు, యేసు క్రీస్తను ఒక మనుష్యుని కృప చేతనైన దానమును, అనేకు లకు విస్తరించెను.
మరియు పాపము చేసిన యొకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధమూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను; కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను.
మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే యేలిన యెడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై, మరి నిశ్చయముగా యేసు క్రీస్తను ఒకని ద్వారానే యేలుదురు.
అందుకు యేసు–పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;
ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసు నందు నిత్య జీవము.