Lydda
అపొస్తలుల కార్యములు 9:32

ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారముచేయుచు, లుద్దలో కాపురమున్న పరిశుద్ధులయొద్దకు వచ్చెను.

అపొస్తలుల కార్యములు 9:36

మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను; ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్‌క్రియలను ధర్మకార్యములను బహుగా చేసియుండెను.

desiring
2 రాజులు 4:28-30
28

అప్పుడు ఆమె కుమారుడు కావలెనని నేను నా యేలినవాడవైన నిన్ను అడిగితినా? నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్ప లేదా? అని అతనితో మనవి చేయగా

29

అతడు నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని పొమ్ము; ఎవరైనను నీకు ఎదురుపడిన యెడల వారికి నమస్కరింప వద్దు; ఎవరైనను నీకు నమస్కరించిన యెడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు; అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖము మీద పెట్టుమని గేహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను.

30

తల్లి ఆ మాట విని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువ నని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడ పోయెను.