
ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి నీ విక్కడనుండి బయలుదేరి పొమ్ము ; హేరోదు నిన్ను చంప గోరుచున్నాడని ఆయనతో చెప్పగా
ఆయన వారిని చూచి మీరు వెళ్లి , ఆ నక్కతో ఈలాగు చెప్పుడి ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ల గొట్టుచు (రోగులను) స్వస్థపరచుచు నుండి మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందెదను .
హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను . ఆయనను గూర్చి చాల సంగతులు విన్నందున ఆయన ఏదైనను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి , బహుకాలమునుండి ఆయనను చూడగోరెను.