
దేవుడైన యెహోవా ఆదామును పిలిచి–నీవు ఎక్కడ ఉన్నావనెను.
అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి ఆయన ఆలోచనకొరకు కనిపెట్టుకొనకపోయిరి.
వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచి–మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి
మరల వంగి నేలమీద వ్రాయు చుండెను.
వారామాట విని, పెద్దవారు మొదలుకొని చిన్నవారివరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లిరి; యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీ మధ్యను నిలువబడియుండెను.
యేసు తలయెత్తి చూచి–అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు
మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి.