ఆయన మరల తూరు ప్రాంతములు విడిచి, సీదోను ద్వారా దెకపొలి ప్రాంతములమీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను.
గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయయను ప్రదేశములనుండియు యొర్దానునకు అవతలనుండియు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను.