
రోషము విషయమైన విధియిదే. ఏ స్త్రీయైనను తన భర్త అధీనములో నున్నప్పుడు త్రోవ తప్పి అపవిత్రపడిన యెడలనేమి,
లేక వానికి రోషము పుట్టి తన భార్యమీద కోపపడినయెడలనేమి, వాడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టినప్పుడు యాజకుడు ఆమెయెడల సమస్తము విధిచొప్పున చేయవలెను.
అపవిత్రమైనదానికిని పవిత్రమైనదానికిని తినదగిన జంతువులకును తినదగని జంతువులకును భేదము చేయునట్లు
జంతువులనుగూర్చియు, పక్షులను గూర్చియు, జలచరములైన సమస్త జీవులను గూర్చియు, నేలమీద ప్రాకు సమస్త జీవులను గూర్చియు చేసిన విధి యిదే అని చెప్పుమనెను.
అప్పుడు అది పవిత్రమగును. బొచ్చు బట్టయందేగాని నారబట్టయందేగాని పడుగునందేగాని పేకయందేగాని తోలువస్తువులయందేగాని యుండు కుష్ఠుపొడను గూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధి యిదే.
ప్రతివిధమైన కుష్ఠుపొడను గూర్చియు, బొబ్బను గూర్చియు
వస్త్రకుష్ఠమునుగూర్చియు, వస్త్రమునకైనను ఇంటికైనను కలుగు కుష్ఠమునుగూర్చియు,
వాపును గూర్చియు, పక్కునుగూర్చియు, నిగనిగలాడు మచ్చను గూర్చియు,
ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో, యెప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్ఠమును గూర్చిన విధి.
స్రావముగలవానిగూర్చియు, వీర్యస్ఖలనమువలని అపవిత్రతగలవానిగూర్చియు, కడగానున్న బలహీనురాలిని గూర్చియు,
స్రావముగల స్త్రీ పురుషులను గూర్చియు, అపవిత్రురాలితో శయనించువాని గూర్చియు విధింపబడినది ఇదే.