అధి కారులను
సంఖ్యాకాండము 22:7

కాబట్టి మోయాబు పెద్దలును మిద్యాను పెద్దలును సోదె సొమ్మును చేత పట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా

సంఖ్యాకాండము 22:8

అతడు వారితో–యీ రాత్రి ఇక్కడనే ఉండుడి; యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పెదననెను. అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బసచేసిరి.

అపొస్తలుల కార్యములు 10:7

అతనితో మాటలాడిన దూత వెళ్లిన పిమ్మట అతడు తన యింటి పనివారిలో ఇద్దరిని, తన యొద్ద ఎల్లప్పుడు కనిపెట్టుకొని యుండువారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి

అపొస్తలుల కార్యములు 10:8

వారికి ఈ సంగతులన్నియు వివరించి వారిని యొప్పేకు పంపెను.