
అర్పాదు దేవతలేమాయెను? సెపర్వయీము దేవత లేమాయెను? షోమ్రోను దేశపు దేవత నా చేతిలోనుండి షోమ్రోనును విడిపించెనా?
యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడిపించు ననుటకు ఈ దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును నా చేతిలోనుండి విడిపించినది కలదా? అని చెప్పెను.
యూదా రాజగు హిజ్కియాతో ఈలాగు చెప్పుడి యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింప బడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవునిచేత మోస పోకుము.
అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా; నీవుమాత్రము తప్పించుకొందువా?
నా పితరులు నిర్మూలముచేసిన గోజానువారు గాని హారానువారు గాని రెజెపులు గాని తెలశ్శారులోనుండిన ఏదెనీయులు గాని తమ దేవతల సహాయమువలన తప్పించుకొనిరా?
హమాతు రాజు ఏమాయెను? అర్పాదు రాజును సెపర్వయీము హేన ఇవ్వా అను పట్టణముల రాజులును ఏమైరి? అని వ్రాసిరి