
ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్ము పోనియ్యడని నేనెరుగుదును;
ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పులచేత నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించెదను.
కాగా యెహోవా మోషేతో – ఫరోయొద్దకు వెళ్లుము. నేనే యెహోవానని మీరు తెలిసికొనునట్లును, నేను చేయు సూచకక్రియలను ఐగుప్తీయుల యెదుట కనుపరచుటకు, నేను వారియెడల జరిగించిన వాటిని వారి యెదుట కలుగజేసిన సూచకక్రియలను
కాగా పొందగోరువానివలననైనను , ప్రయాసపడువాని వలననైనను కాదు గాని ,కరుణించు దేవునివలననే అగును.
మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను నేను నీ యందు నా బలము చూపుటకును , నా నామము భూలోక మందంతట ప్రచురమగుటకును , అందు నిమిత్తమే నిన్ను నియమించితిని.
కావున ఆయన ఎవనిని కనికరింప గోరునో వానిని కనికరించును; ఎవని కఠినపరచ గోరునో వాని కఠినపరచును .
అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి, ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసెదను.