దానికి ముద్రలు వేసిరి
నెహెమ్యా 9:38
నెహెమ్యా
నెహెమ్యా 8:9

జనులందరు ధర్మశాస్త్రగ్రంథపు మాటలు విని యేడ్వ మొదలుపెట్టగా, అధికారియైన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రియునగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులును– మీరు దుఃఖపడవద్దు, ఏడ్వవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి.

Tirshatha
నెహెమ్యా 7:70

పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయము చేసిరి. అధికారి ఖజానాలో నూట ఇరువది తులముల బంగారమును ఏబది పళ్లెములను ఏడువందల ముప్పది యాజక వస్త్రములను వేసి యిచ్చెను.

ఎజ్రా 2:63

మరియు పారసీకుల అధికారి ఊరీమును తుమీ్మమును ధరించుకొనగల యొక యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారి కాజ్ఞాపించెను.

హకల్యా కుమారుడైన
నెహెమ్యా 1:1

హకల్యా కుమారుడైన నెహెమ్యాయొక్క చర్యలు. ఇరువదియవ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా