బేత్షెమెషు
యెహొషువ 21:16

అనగా ఆ రెండు గోత్రములవారినుండి తొమి్మది పట్టణములను ఇచ్చిరి.

1 సమూయేలు 6:9

అది బేత్షెమెషుకు పోవు మార్గమున బడి యీ దేశపు సరిహద్దు దాటిన యెడల ఆయనే యీ గొప్పకీడు మనకు చేసెనని తెలిసి కొనవచ్చును; ఆ మార్గమున పోని యెడల ఆయన మనలను మొత్త లేదనియు, మన అదృష్టవశముచేతనే అది మనకు సంభవించెననియు తెలిసికొందు మనిరి.

1 సమూయేలు 6:19

బేత్షెమెషు వారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతముచేసి ఆ జనులలో ఏబది వేల డెబ్బదిమందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి.

1 సమూయేలు 6:20

అప్పుడు బేత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? మనయొద్దనుండి ఆయన ఎవరియొద్దకు పోవలెనని చెప్పి